టీడీపీకి షాక్ బీజేపీలోకి ఆదినారాయణ రెడ్డి జంప్

టీడీపీకి షాక్ బీజేపీలోకి ఆదినారాయణ రెడ్డి జంప్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ ఆదినారాయణ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు…

ఢిల్లీ సాక్షిగా ఆయన బీజేపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కండువాను వీడి బీజేపీ కండువాను భూజాన వేసుకున్నారు… కొద్దికాలంగా ఆయన బీజేపీలోకి జంప్ చేసేందుకు సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి… ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను బీజేపీలో చేరుతానంటు వస్తున్న వార్తలు నిజమే అని తెలిపారు…

కానీ ఇంతలో చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇవ్వడంతో కాస్త వెనకడుగు వేసినా చివరకు ఆయన బీజేపీలోకి చేరిపోయారు… 2019 ఎన్నికల్లో జమ్మలమడుగుకు గుడ్ బై చెప్పి కడప ఎంపీ స్ధానంలో పోటీ చేసి ఓటమి చెందారు అదినారాయణ రెడ్డి..