నటి శ్రియ డాన్సర్ కావాలనుకుంది.. కానీ…

నటి శ్రియ డాన్సర్ కావాలనుకుంది.. కానీ...

0

నటి శ్రియ హీరోయిన్ గా తెలుగు తెరను కొన్నేళ్ళ పాటు ఏలింది. సౌతిండియాలోని టాప్ స్టార్స్ తో ఆమె నటించింది. నాటి టాప్ స్టార్స్ శ్రియ తో నటించాలని కోరుకున్నారు అనుకుంటేనే ఆమె టాలెంట్ ఎంటో అర్థమవుతోంది. ఇప్పటికీ శ్రియ సినీ జీవితం పద్దెనిమిదేళ్ల అంటే షాక్ అవ్వాల్సిందే.. ఆమె చిన్నప్పుడు మంచి డాన్సర్ కావాలనుకుందటా అలా అనుకొని ఆమె కెరీర్ ని స్టార్ట్ చేసింది. కానీ అనుకోకుండా ఆమెకు టాలీవుడ్ లోనే మొదటి ఛాన్స్ వచ్చింది. ఇష్టం సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమాలో శ్రియ చేసిన నటన కి తెలుగు ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. ఆ తర్వాత ఆమె సంతోషం మూవీతో కమర్షియల్ హిట్ అందుకుంది. దాంతో ఇక ఆమె వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాలో శ్రియ అదరగొట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ శివాజీ సినిమా ఆమెకు ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ సరసన చెన్నకేశవరెడ్డి తో పాటు ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి పైసా వసూల్ లో నటించి సరిజోడి అనిపించుకుంది. అక్కినేని నాగార్జున తో నేనున్నాను, మనం వంటి సినిమాలు చేసింది. విక్టరీ వెంకటేష్ సరసన సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల సినిమాలు చేసింది.

తొలినాళ్లలో శ్రీయ తరుణ్ తో జతకట్టి చూడ చక్కని జంట అనిపించింది. ఇదిలా ఉండగా 2018లో శ్రీయ ఆండ్రూస్ నీ పెళ్లి చేసుకుంది. అయితే మంచి పాత్రలు వస్తే నటించేందుకు ఇప్పటికీ నేను రెడీ అంటూ ఈ అందాల భామ ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు మాటలు లేవు కేవలం సైగలతోనే ఆమె పాత్ర ఉంటుందట. శ్రియ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.