శ్రీరెడ్డి పశ్చాత్తాపం..తొలిసారిగా శ్రీరెడ్డి అలా

0

ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ ఇష్యూలో చిరంజీవి తల్లిని తీవ్ర పదజాలంతో దూషించింది శ్రీరెడ్డి. బుద్ది గడ్డి తిని తాను చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరింది.

ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. ‘ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్‌ మీడియాలో కూడా చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నా.

అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నా. నేను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి’ అంటూ తొలిసారి శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://twitter.com/MsSriReddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here