ఇష్టం లేకుండానే ‘మల్లీశ్వరి’లో నెగెటివ్ రోల్ చేశాను: స్మిత

ఇష్టం లేకుండానే 'మల్లీశ్వరి'లో నెగెటివ్ రోల్ చేశాను: స్మిత

0

గాయనిగా స్మితకు మంచి పేరు వుంది. అలాంటి ఆమె వెంకటేశ్ – కత్రినా కైఫ్ జంటగా చేసిన ‘మల్లీశ్వరి’ సినిమాలో నెగెటివ్ రోల్ చేసింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఆ విషయాన్ని గురించి ప్రస్తావించింది.

‘మల్లీశ్వరి’ సినిమాలో ప్యాలెస్ లో పనిమనిషిగా నెగెటివ్ రోల్ చేశాను. నిజానికి ఆ సినిమాలో ఆ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. అంతకుముందు చాలా ఆఫర్లు వచ్చినా చేయదలచుకోలేదు. సన్నిహితులంతా చేయమంటేనే ఒప్పుకున్నాను. కానీ షూటింగు జరుగుతున్నన్ని రోజులు ఈ పాత్రను చేయడం అవసరమా అనే అనుకున్నాను. కాకపోతే షూటింగులో నన్ను అంతా బాగా చూసుకున్నారు. కానీ ఎందుకో ఇక నటన వైపు వెళ్లాలనిపించలేదు. అందుకనే ఆ తరువాత మరే సినిమాలోను చేయలేదు” అని చెప్పుకొచ్చింది.