పక్క లోకి వెళ్తే అవకాశాలు ఇస్తారట

పక్క లోకి వెళ్తే అవకాశాలు ఇస్తారట

0

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో కాస్టింగ్ కోచ్ ఉదంతం బయటపడింది. దర్శకుడు రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శిరీష అనే ఐటమ్ సాంగ్ ఆర్టిస్ట్ ఆరోపణలు చేసింది. ఇప్పటికి 50కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన సినిమా అవకాశాలు రాకుండా రవిబాబు బెదిరింపులకు పాల్పడుతున్నడంటు వాపోయింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నాకు జరిగిన అన్యాయం పై గొంతు విప్పుతున్న తెలుగు ఇండస్ట్రీలో నన్ను పట్టించుకోవడం లేదు. తినడానికి తిండి లేక పచ్చడి మెతుకులతో బతుకు సాగిస్తున్న దర్శకులు నిర్మాతలు పక్కలోకి అయితే వెళ్లాలి కానీ సినిమా అవకాశాలు మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్లకు ఇస్తున్నారు.

ఆకలితో ఉన్న ఆర్టిస్ట్ కి అన్నం పెట్టని ఇండస్ట్రీ ఎందుకు అని ఆమె ప్రశ్నించింది గతంలోనే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని అన్నాను ఇప్పుడు దాన్ని నిజం చేసి చూపిస్తా నేను గతంలో నువ్విలా అనే సినిమాలో రవిబాబు తో పని చేశా. అతనికి చాలా మంది క్రియేటివిటీ దర్శకుడు అంటారు కానీ నా విషయంలో అది తప్పు అతను నాతో నీ రేటెంత అంటూ ఎంత దారుణంగా మాట్లాడా డో.. ఈ చాట్ చూడండి అంటూ చాటింగ్ బయట పెట్టింది.

ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే మాలాంటి వాళ్లకు ఏలా అవకాశాలు వస్తాయి. నేను అవకాశాల కోసం ఇతర డైరెక్టర్ల దగ్గరికి వెళ్తుంటే ఫోన్లు చేసి ఇవ్వొద్దని చెబుతున్నాడు రెండేళ్ల నుంచి నన్ను ఇదే రకంగా టార్చర్ చేస్తున్నాడు. పక్కలోకి వెళ్లలేదని నాకు బతుకు లేకుండా చేస్తున్నాడు. అతను పెద్ద డైరెక్టర్ కదా అని నన్ను ఏం చేస్తాడో అన్న భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇలాంటి చీడ పురుగులు ఇండస్ట్రీలో ఉంటే కొత్తవాళ్ళు ఎలా వస్తారు. నాకు ఏదైనా జరిగితే దానికి రవిబాబే కారణం తనవల్ల నాకు ప్రాణహాని ఉంది అంటూ రవి బాబు పై ఆరోపణలు చేసింది.