చచ్చిపోదామని కొండెక్కిన యువతీ ప్రాణాన్ని కాపాడిన ఎస్ఐ మాటలు..

0

కేరళకు చెందిన సంతోష్ అనే పోలీస్ ఆఫీసర్ అడిమాలీకి చెందిన ఓ యువతికి ఇచ్చిన మనోధైర్యంతో ఆత్మహత్య చేసుకుందామని నిశ్యయించుకున్న ఆ యువతీ మనస్సు మార్చుకొని వెనెక్కి వచ్చింది. కేరళలోని ఇడుక్కిలో ఈ ఘటన చోటుచేసుకోగా..యువతిని గమనించిన స్థానికులు ఘటన  స్థలానికి చేరుకున్నారు.  ఆమెకు నచ్చజెప్పి కొండ కిందికి దింపుదామని స్థానికులు ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేసారు.

దాంతో అక్కడికి చేరుకున్న అడిమాలీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోష్ ఆమెతో మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకునేలా చేసాడు. పరిష్కారం లేని సమస్యలు ఉండవని, వాటిని అవసరమైతే తానే తీరుస్తానని హామీ ఇచ్చి నిండు ప్రాణాన్ని  కాపాడిన ఘనత సాధించాడు. దాంతో స్థానికులు పోలీస్ ఆఫీసర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ యువతీ క్షణాల్లో ప్రాణాపాయం నుండి బయటపడ్డందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here