త్వరలో చంద్రబాబు పరామర్శ యాత్ర: సోమిరెడ్డి

త్వరలో చంద్రబాబు పరామర్శ యాత్ర: సోమిరెడ్డి

0

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య ఆరోపించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, వర్ల రామయ్య.. సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దాడులకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారని వెల్లడించారు. కుప్పం పర్యటన తర్వాత బాధిత కుటుంబాలను చంద్రబాబు కలుస్తారని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని సోమిరెడ్డి, వర్ల రామయ్య తెలిపారు. అదేవిధంగా త్వరలోనే కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.