పవన్ కు సోము వీర్రాజు బంపర్ ఆఫర్

0

ఓ పక్క పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే అనుమానాలని అందరికి కలిగిస్తున్నాయి… అయితే తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను అని చెప్పకనే చెప్పారు.. దీంతో ఆయన త్వరలో బీజేపీలో కలిసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.. అయితే బీజేపీ ఇప్పుడు బలంగా ఉంది. కేంద్రంలో కూడా అధికారంలో ఉంది.. అమిత్ షా చాణిక్యత కూడా పవన్ కి నచ్చింది అని చెబుతున్నారు.

అయితే దీనిపై ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం అంటున్నారు.. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ అలాగే బీజేపీ ఎమ్మెల్సీలు కూడా అదే అంటున్నారు , తాజాగా బీజేపీ నేత సోము వీర్రాజు కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.

అమిత్ షా అంటే తనకు ఇష్టమని చెబుతున్న పవన్ కల్యాణ్, గతంలో అమిత్ షా గురించి ఎవరి దగ్గర ఏం వ్యాఖ్య చేశారో, ఆయన బయటకు చెప్పాలని సోము వీర్రాజు అన్నారు. ఏ పార్టీ వచ్చిన స్వాగతిస్తాం విలీనమా లేదా కలిసి పనిచేస్తారా అని పవన్ కు తెలియచేశారు.