చంద్రబాబుకు ఛీ కొట్టినా సిగ్గు రాలేదు…

చంద్రబాబుకు ఛీ కొట్టినా సిగ్గు రాలేదు...

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఛీ కొట్టినా కూడా సిగ్గురాలేదని ఏపీ ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని కడప జిల్లాలో పర్యటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు… ఈ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా కూడా సిగ్గురాలేదని అన్నారు… చంద్రబాబు నాయుడు జమిలీ ఎన్నికలు వస్తున్నాయని మాయ మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు…

అయితే ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు… ఒక వేల జమిలీ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేరని అన్నారు… కోర్టు చుట్టు తిరిగి 26 స్టేలు తెచ్చుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు…