స్టూడియో కాదు కొత్త వ్యాపారంలోకి మెగాస్టార్ చిరంజీవి

స్టూడియో కాదు కొత్త వ్యాపారంలోకి మెగాస్టార్ చిరంజీవి

0

మెగాస్టార్ తాజాగా సినిమాల్లో బిజీగా ఉన్నారు , ఆయన తనయుడు కూడా ఇటు నిర్మాతగా హీరోగా పలు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీ ఓస్టూడియో నిర్మించబోతున్నారు అని, దాదాపు కోట్ల రూపాలయతో పెద్ద బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అని, విశాఖలో ఇది ఉంటుంది అని వార్తలు వచ్చాయి. అంతా చరణ్ చూసుకుంటున్నారు అని గుసగుసలు వినిపించాయి.

మరికొద్ది రోజుల క్రితం కోకాపేట్ వ్యవసాయ భూమిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫిల్మ్ స్టూడియోను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి, కాని చిరు ఈ స్టూడియోల నిర్మాణం విషయంలో బ్యాక్ స్టెప్ వేశారు అని వార్తలు వస్తున్నాయి.

ఎందుకు అంటే ఎంతో కాలంగా ఉన్న ప్రసాద్ ల్యాబ్స్, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలు కూడా లాభాలు తగ్గి నష్టాల్లో నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయి ఈ సమయంలో ఇది ప్రయాస అని చిరు ఆలోచించారట. సినిమా స్టూడియోని నిర్మించడానికి బదులుగా, రిసార్ట్ లేదా ఫంక్షన్ హాల్ నిర్మించడం లాభదాయకంగా ఉంటుందని చిరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది సంగతి మరి మెగా అభిమానులు మాత్రం ఈ వార్త తెలిశాక కాస్త నిరాశ పడ్డారు.