చంద్రబాబు ఇంకా అదే భ్రమలో ఉన్నారు:సుచరిత

చంద్రబాబు ఇంకా అదే భ్రమలో ఉన్నారు:సుచరిత

0

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీరుపై ఏపీ హోంమంత్రి సుచరిత తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఆయనే ముఖ్యమంత్రిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. విపక్ష నేతననే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి అంశానికీ ఆయన రాజకీయ రంగు పులుముతున్నారని సుచరిత మండిపడ్డారు. చంద్రబాబుకు బుల్లెట్‌ ప్రూఫ్‌, ఎస్కార్ట్‌ కార్లు ఇచ్చామని, భద్రతా సమీక్ష కమిటీ చెప్పిన దానికంటే ఎక్కువ భద్రతే ఆయనకు కల్పించినట్టు ఆమె వెల్లడించారు. వాస్తవంగా చంద్రబాబు భద్రతకు 58 మందినే కేటాయించాలి.. కానీ ఆయనకు రక్షణగా 74 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని హోంమంత్రి వివరించారు. భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరలేదని సుచరిత తెలిపారు.