అయ్యా లోకేష్..ముందు ఆ మూడు పదాలు పలుకు! : ఎమ్మెల్యే సుధాకర్ బాబు

అయ్యా లోకేష్..ముందు ఆ మూడు పదాలు పలుకు! : ఎమ్మెల్యే సుధాకర్ బాబు

0

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. 175 సీట్లకు వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలిచి విజయదుంధుబి మోగించింది. గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్లే ఇంత దారుణ వైఫలం పొందిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అఖండ మెజార్టీతో గెలుపొందిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు తాము ఇచ్చిన హామీలు అన్నీ నెరవేస్తానని ఇప్పటికే ‘నవరత్నాలు’ లో ఒక్కొక్కటీ అమలు చేస్తున్నారు.

అయితే సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. సీఎం మొదలు పెట్టిన అభివృద్ది పనులపై విమర్శలు చేస్తూ.. తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే.. టీడీపీ నేతలపై పలు విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా కూడా చంద్రబాబు, లోకేష్ లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు.

టీడీపీ నేతల అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామన్నారు. ఓ వైపు లోకేష్ ట్వీట్లకు తమ నేత ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తున్నా బుద్దిరాలేదని అన్నారు. నాలుగు పదాలు సరిగ్గా పలకలేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను సరిగ్గా పలకనమండి చూద్దాం అని ఆయన సవాల్ విసిరారు. ఈ మూడు పదాలను వరుసపెట్టి పలకలగలిగితే.. లోకేష్‌ను చంద్రబాబుకు నిజమైన రాజకీయ వారసుడిగా ఒప్పుకుంటామన్నారు.