ఆ ఒక్క మాటతో నా లవర్ కి ఫోన్ చేయడం మానేశా – సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ వింటే కంటతడే

ఆ ఒక్క మాటతో నా లవర్ కి ఫోన్ చేయడం మానేశా - సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ వింటే కంటతడే

0

బుల్లితెర మెగాస్టార్ గా సుడిగాలి సుధీర్ కి ఎంతో ఫేమ్ ఉంది, ఇప్పుడు కమెడియన్ నుంచి ఆయన సినిమా హీరో అయ్యారు చేతిలో మూడుప్రాజెక్టులు ఉన్నాయి, అయితే సుడిగాలి సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేదానిపై చాలా మంది అడుగుతూనే ఉన్నారు, ఎన్నిసార్లు ప్రశ్నించినా సుధీర్ మాత్రం మాట దాటవేస్తున్నాడు, అయితే ఆయన లవ్ స్టోరీ విషయం కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

నేను ఓ అమ్మాయిని ప్రేమించాను స్కూల్ టైంలో…. ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి ఆమె అంటే ఇష్టం, 9 క్లాస్ లో ఐలవ్యూ అని చెప్పాను, ఇలా ఇద్దరం ఇంటర్ వరకూ ప్రేమించుకున్నాం, ఆమెకి ఈ సమయంలో వేరే వ్యక్తితో వివాహం చేశారు,
అప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నాను. తను విజయవాడలో ఉంది. కమ్యూనికేట్ చేసుకోవడానికి మా దగ్గర ఫోన్లు లేవు.

అయితే ఆమెకి ఓరోజు ఫోన్ చేశాను, నేను చాలా సంతోషంగా ఉన్నా డిస్టర్బ్ చేయద్దు అంది.. అప్పటి నుంచి ఆమెని మర్చిపోయా.. ఇక వివాహం అయింది కాబట్టి నేను ఏమీ మాట్లాడలేదు, తర్వాత కుటుంబం లైఫ్ ఇలా ముందుకు సాగుతున్నా అని తన ప్రేమ గురించి చెప్పాడు సుధీర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here