వైసీపీ విజయంపై సంచలన నిజాన్ని భయట పెట్టిన సుజనా

వైసీపీ విజయంపై సంచలన నిజాన్ని భయట పెట్టిన సుజనా

0

బీజేపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ బలంగా ఉందని అన్నారు.

కానీ అదే సమయంలో బీజేపీ, పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబుకు మద్దతు రావడంతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు… తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు… 2014 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే వైసీపీనే అధికారంలోకి వచ్చేదని అన్నారు…

ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీని దూరం చేసుకోవడం వల్లే సైకిల్ కు ఈ గతి పట్టిందని సుజనా ఎద్దేవా చేశారు… టీడీపీ బీజేపీ ఎప్పటికి పొత్తు కొనసాగించాలని కోరుకునే వారిలో తాను ఒకరినని అన్నారు… ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా కూడా తాను బీజేసీలో చేరేవాడినని స్పష్టం చేశారు సుజనా…