సుకుమార్‌తో అల్లు అర్జున్ సినిమా లాంచ్

సుకుమార్‌తో అల్లు అర్జున్ సినిమా లాంచ్

0

స్టైలిస్టార్ అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఒకటిగా కనిపిస్తుంది ’ఆర్య’. ఈ సినిమా ఆయనను హీరోగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లింది. అంతే కాదు యూత్ లో ఆయన ఫాలోయింగ్ ను పెంచింది. అనంతరం ఇదే కాంబినేషన్లో ’ఆర్య 2’ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ సినిమాను అక్టోబర్ 3వ తేదీన లాంచ్ చేస్తారన్నది తాజా సమాచారం. అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగును ప్రారంభించనున్నారు. నెలాఖరు వరకూ ఫస్టు షెడ్యూల్ షూటింగును నిర్వహిస్తారు. అనంతరం అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకుని, ’అల వైకుంఠపురములో’ షూటింగును పూర్తిచేస్తాడట. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తరువాత పూర్తి సమయాన్ని సుకుమార్ సినిమాకే కేటాయిస్తాడని అంటున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.