సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబోలో ఆర్య-3?

Sukumar- Vijay Devarakonda Combo Arya-3?

0

ప్రస్తుతం అల్లు అర్జున్​తో ‘పుష్ప’ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే విజయ్ దేవరకొండతో మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారట. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

సుకుమార్-దేవరకొండ కాంబోలో తెరకెక్కిబోయే చిత్రం ‘ఆర్య 3’ అని టాక్. బన్నీతో ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలతో సెన్సేషన్ సృష్టించిన ఈ లెక్కల మాస్టారు. ఈసారి విజయ్​తో ఈ మ్యాజికల్ లవ్​స్టోరీని రూపొందించాలని భావిస్తున్నారట.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇటీవలే ‘ఆర్య 3’ కచ్చితంగా ఉంటుందని ప్రకటించిన సుక్కు.. ఇలా విజయ్​తో ఈ మూవీ తెరకెక్కిస్తారన్న వార్త తెలియగానే బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఏదేమైనా అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here