ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా- సుమన్

ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా- సుమన్

0

తెలుగులో ఎందరో హీరోలు ఉన్నా సుమన్ అంటే యాక్షన్ హీరో అని అంటారు.. ఓ మంచి ఫ్యామిలీ కథ వచ్చినా వెంటనే చేయడానికి ఆయన వెనకడారు, అయితే ఇలాంటి హీరోలు కొద్ది మంది మాత్రమే ఉంటారు, అందులో సుమన్ కూడా ఒకరు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు..

ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి నేను నటన వైపుకు వచ్చాను. ఏ భాషకి చెందిన చిత్రపరిశ్రమలోను నాకు తెలిసిన వాళ్లెవరూ లేరు. నాకు నాటకాలు .. డ్రామాలు వేసిన అనుభవమూ లేదు. అయినా సినిమాల్లో నేను నటించాను నాకు అవకాశాలు వచ్చాయి.. అంతేకాదు నాకు తమిళ సినిమాలో తొలిసారిగా హీరోగా చేసే అవకాశం వచ్చింది అని తెలిపారు సుమన్.

తర్వాత వరుసగా తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో కలుపుకుని హీరోగా 150 సినిమాలకి పైగా చేశాను అని సుమన్ తెలిపారు… ప్రజలు నన్ను బాగా ఆదరించారు అని తన సినిమాలు హిట్ చేశారు అని అన్నారు… మొత్తంగా 400 సినిమాలను పూర్తి చేశాను. ఒక్క తెలుగులోనే హీరోగా 99 సినిమాలు చేశాను. 100వ సినిమాకి అన్ని కుదరాలనే ఉద్దేశంతో మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు. మొత్తానికి తెలుగు డైరెక్టర్లు సుమన్ కోసం మంచి కథ సిద్దం చేస్తే
చేసేందుకు ఆయన సిద్దంగా ఉన్నారట.