తనకు ఏమైందో మొత్తం పూర్తిగా చెప్పిన సునీల్

తనకు ఏమైందో మొత్తం పూర్తిగా చెప్పిన సునీల్

0

ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వినిపించాయి.. అంతేకాదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయనకు ఏమైంది అని అందరూ కంగారు పడ్డారు.. అయితే ఆయన కుటుంబం అలాగే సినిమా నటులు ఎవరూ కూడ దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు, అంతేకాదు డాక్టర్లు కూడా దీనిపై ఏమీ తెలియచేయలేదు.

అసలు వినిపించిన వార్తలు చూస్తే సునీల్ కొంత కాలంగా గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది, దీంతో సునీల్ను మాదాపూర్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చారని, ఇటీవలి కాలంలో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్లే సునీల్ అస్వస్థతకు గురైనట్టుగా వార్త వినిపించింది.. అంతేకాదు హాస్పటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే దీనిపై అనేక వార్తలు రావడంతో నేరుగా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనేది సునీల్ తెలియచేశారు, ఆయన బాగానే ఉన్నాను అని ఫోటో కూడా విడుదల చేశారు….. మీ ఆశీర్వాద బలంతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం పట్ల ఎంతగానో ఆందోళన చెందిన అందరికీ కృతజ్ఞతలు. నాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. విడుదల కాబోతున్న డిస్కోరాజా చిత్రం చూసి అందరూ ఎంజాయ్ చేయండి అని సునీల్ చెప్పారు, దీంతో అందరూ హమ్మయ్య అంటూ హ్యాపీ ఫీల్ అయ్యారు.