బ్రేకింగ్ తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు సునీల్ అసలు ఏమైందంటే

బ్రేకింగ్ తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు సునీల్ అసలు ఏమైందంటే

0

తెలుగులో అలనాటి కమెడియన్ల తర్వాత కామెడికి ఆయన కేరాఫ్ అడ్రెస్ అయ్యారు .. నవ్వులు రారాజుగా కామెడిలో సునీల్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు సంపాదించుకున్నారు. అయితే హీరోగా మారి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటిస్తున్నాడు సునీల్ తాజాగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏ.ఐ.జీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు, అయితే ఆయన సాధారణ చెకప్ కు వచ్చారా లేదా ఆరోగ్యం బాగాలేక వచ్చారా అనేది తెలియాలి.సునీల్ మాత్రం గొంతు, లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలో నటించాడు. ఇక డిస్కోరాజా సినిమాలో కూడా సునీల్ నటించారు.

ఈ సమయంలో ఆయనకు ఇలా జరిగింది అని తెలిసి అభిమానులు కంగారు పడుతున్నారు..ఆయన పీఆర్ టీం కూడా ఏమీ బయటకు విషయం చెప్పలేదు.. కాని సినిమా నటులు సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం సాధారణ చెకప్ అని, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అంటున్నారు, మరి మా సునీల్ కు ఎలా ఉందో కాస్త బయటకు చెప్పండి అని అడుగుతున్నారు అభిమానులు.