‘దొరసాని’ నుంచి మనసును దోచే పాట

'దొరసాని' నుంచి మనసును దోచే పాట

0

కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ‘దొరసాని’ అనే ప్రేమకథ రూపొందుతోంది. జీవితా రాజశేఖర్ కూతురు శివాత్మిక .. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నాయికా నాయకులుగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.

“కళ్లల్లో కలవరమై .. కలవరమై,గుండెల్లో పరవశమో వరమై .. ” అంటూ ఈ పాట సాగుతోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం .. శ్రేష్ట సాహిత్యం .. చిన్మయి శ్రీపాద ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ‘గడీ’లో పెరిగిన కథానాయిక, కథానాయకుడు తారపడిన తరువాత తొలిసారిగా ప్రేమ భావనలకు లోనైన క్షణంలో తెరపై ఈ పాట ఆవిష్కృతమవుతుందని అనుకోవచ్చు. ప్రశాంత్ ఆర్ విహారి బాణీ యూత్ హృదయాలను దోచుకునేలా వుంది. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.