సూపర్ స్టార్ పై కేసు నమోదు…

సూపర్ స్టార్ పై కేసు నమోదు...

0

తమిళనాడు పెరియార్ పై సుపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు మరింత ముదురుతోంది… రజనీ పెరియార్ పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడ కలిగం అధ్యక్షుడు మణీ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు అయింది.

దీనితోపాటు పెరియార్ రామస్వామిపై రజనీ అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేశారు ద్రవిడ కలిగం నేతలు.. రజనీ రాజకీయ ప్రవేశం కోసమే పెరియార్ ప్రతిష్టతకు భంగం కలిగించేలా అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు…

ఇక దీనిపై స్పందించిన రజనీ తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని తెలిపారు… 1971లో సీతారాములు చిత్రపటాలను దుస్తులు లేకుండా ఊరేగించారని పెరియార్ చేసిన నిరసన కరెక్ట్ కాదని రజనీ స్పష్టం చేశారు…