రజనీకాంత్ పుట్టిన రోజున అభిమానులకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్

రజనీకాంత్ పుట్టిన రోజున అభిమానులకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్

0

రజనీ కాంత్ అభిమానులకు డిసెంబర్ నెల అంటే చాలా ప్రత్యేకం అనే చెప్పాలి ..అవును ముందుగా రజనీ అభిమానులు సౌత్ లో ఆయన పుట్టిన రోజున చాలా కార్యక్రమాలు చేస్తారు…. 12-12-1950న రజని జన్మించడం జరిగింది. ప్రతీసారి ఆయన తన అభిమానులకు తన పుట్టిన రోజున సినిమా గురించి సరికొత్త ట్రీట్ ఇస్తారు.

మరి ఇప్పుడు తలైవా తన అభిమానుల కోసం ఏం చేస్తారు అనే చర్చ జరుగుతుతోంది.. టాక్ అయితే సౌత్ లో మరీ ముఖ్యంగా కోలీవుడ్ లో నడుస్తోంది..ప్రస్తుతం ఆయన నటిస్తున్న దర్బార్ మూవీ టీజర్ ఆరోజు విడుదల చేయనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ విడుదలకు తలైవా పుట్టిన రోజు పర్ఫెక్ట్ సిచ్యువేషన్ గా చిత్ర బృందం భావిస్తున్నారట.

అయితే సర్ ఫ్రైజ్ కోసం దర్శకుడు మురుగదాస్ కూడా దీని కోసం వర్క్ చేస్తున్నారు అని తెలుస్తోంది.
దర్బార్ మూవీలో రజిని పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. తెరపై ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్, మెస్మరైజింగ్ స్టయిల్స్ తో దుమ్మురేపనున్నారు. ఇక తాజాగా విడుదల అయిన సాంగ్ కూడా బీట్ పెంచింది అనే చెప్పాలి. ఆయన పుట్టిన రోజు కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.