బెంగళూరులో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..!!

బెంగళూరులో 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..!!

0

చిరంజీవి నటించిన సైరా సినిమా రిలీజ్ కి అంతా సిద్ధమైంది.. దసరా కానుకగా అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి తెలుగులో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుండగా ఇటీవలే ముంబై లో చిత్ర ప్రమోషన్స్ జోరుగా చేశారు.. కాగా తమిళ్, కన్నడ లో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుండగా కన్నడ లో ప్రమోషన్స్ లో భాగంగా ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారట..

రేపు బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. నాగవార ప్రాంతంలోని మాన్యత టెక్ పార్క్ ప్రాంతంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఏదేమైనా బాహుబలి తర్వాత మల్టీ లాంగ్వేజ్ లో తెలుగు సినిమా లు రావడం రోజు రోజు కి పెరిగిపోతున్నాయని చెప్పాలి..