సైరా.. రిలీజ్ వాయిదా..!

సైరా.. రిలీజ్ వాయిదా..!

0

చిరంజీవి నటించిన సినిమా ’సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న రిలీజ్ చేస్తామన్న సంగతి తెలిసిందే. సైరా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్న ఈ చిత్రానికి హిందీ చిత్రం ’వార్’ అడ్డంకిగా మారేలా ఉంది. మొన్న రిలీజైన ఆ మూవీ ట్రైలర్ చూశాక ’సైరా’ టీం కంగారు పడుతూందని సమాచారం. ’సైరా’ను హిందీలో ప్రమోట్ చేస్తే క్రేజ్ వస్తుందా.. అన్న సందేహాలున్నాయట. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా :ఫ్యాన్స్ ని సంపాదించిన ప్రభాస్. ’సాహో’కు తెలుగులో తప్ప ఇతర రాష్ట్రాలలో ఆశించిన క్రేజ్ సంపాదించలేకపోయాడు. అలాంటిది సైరాకి ఇతర రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఉత్తరాదిన ఆశించిన బజ్ తేగలరా అన్నది సందేహం.

అయితే భారీ అంచనాలున్న ’వార్’ లాంటి చిత్రం రేసులో ఉండగా ’సైరా’ను విడుదల చేస్తే కచ్చితంగా పంచ్ పడుతుందని భావిస్తున్నారు. అందులో వార్ సినిమాలో బాలివుడ్ గ్రేట్ స్టార్ హృతిక్ ఉండడంతో చిరు సినిమాను ఉత్తరాది వాళ్లు పట్టించుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో సినిమాను వారం రోజుల తర్వాత దసరా, దీపావళి టైంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఐతే ’వార్’కు భయపడి సైరాను.. వాయిదా వేయడం ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలా ఇగోకు పోతే సినిమాకు నష్టం వాటిల్లడం ఖాయం. ఏది ఏవైునా చిరు మిగతా రాష్ట్రాల్లో మెగాస్టార్ కాదన్న విషయం గవునించాలి. సినిమాన ఎక్కువ మందికి చేరువ చేయాలన్న, ఆశించిన ఫలితం రావాలన్న ఇగో పక్కన పెట్టి వాయిదా వేయడమే కరెక్ట్ అంటున్నారు బాక్సాఫీస్ నిపుణులు.