సెకండ్ ట్రైలర్ లో సైరా దూకుడు..!!

సెకండ్ ట్రైలర్ లో సైరా దూకుడు..!!

0

భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా ఆ ట్రైలర్ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది

అయితే తాజాగా అభిమానులకు కానుకగా గురువారం ట్రైలర్ -2 ని విడుదల చేశారు. సినిమాలోని యుద్ధ సన్నివేశాలను (బ్యాటిల్ ఫీల్డ్ ట్రైలర్) ట్రైలర్ లో చూపించారు.బాహుబలి సినిమాల తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న సినిమా సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాను చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టిన విషయం తెలిసిందే.

సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయగా.. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలకానుంది.