దుమ్ము రేపిన సైరా టీజర్

దుమ్ము రేపిన సైరా టీజర్

0

ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 22 మిలియన్ల వ్యూస్తో సంచలనాలు రేపుతుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ 24 గంటల్లోనే యూట్యూబ్ వీక్షకులు సునామీని సృష్టించారు.అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతున్న సైరా మూవీ భారీ అంచనాలతో తెరపైకి వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హిరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

చిరు సరసన కతానాయికలుగా నయన తారా, తమన్న నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, విజయ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ నాజర్ తదితర సీనియర్ నటులు ఉన్నారు. అత్యంత ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పవన్ కళ్యాన్ గ్రాతంతో అద్భుతమైన విజువల్స్‌తో టీజర్ మొదలైంది. ’హు ఈజ్ దిస్ నరసింహారెడ్డి?’ అంటూ బ్రిటిష్ అధికారి అన్నప్పుడు ఉదయించే సూర్యుడిని చీల్చికుంటూ గుర్రంపై ఆ వీరుడు వస్తోన్న దృశ్యం టీజర్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ’’సింహంలాంటోడు దొర. అతడే వాళ్ల ధైర్యం దొర’’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్ సమయంలో వచ్చే విజువల్స్ అద్భుతం. ఈ టీజర్‌తో సినిమాపై ఏంతో మందికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆయన టేకింగ్ ఎలా ఉండబోతోందో టీజర్‌ను చూస్తుంటేనే అర్థమవుతోంది.