ఇక తమన్నా అలా కనిపించదేమో..!!

ఇక తమన్నా అలా కనిపించదేమో..!!

0

తెలుగు సినిమా ఇండస్ట్రీకి తమన్నా 2005 లో పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమన్నా ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నది. అగ్రహీరోలందరితో ఆమె నటించింది. ఇప్పుడు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్యతో కూడా నటించింది. వెంకటేష్ తో ఎఫ్ 2, నాగార్జున ఊపిరి సినిమాలో నటించింది. యంగ్ నుంచి సీనియర్ హీరోలందరితో తమన్నా దాదాపుగా నటించి మెప్పించింది. బాహుబలిలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఎఫ్ 2 వరకు మంచి హిట్ లేదు.

ఎఫ్ 2 తరువాత ఈ అమ్మడు ఎక్కువగా హర్రర్ థ్రిల్లింగ్ సినిమాలు చేస్తున్నది. ఇండస్ట్రీలోకి దాదాపు 15 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సినిమాల్లో యాక్ట్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న తమన్నా.. పెళ్లి విషయం గురించి ఎప్పుడు మాట్లాడినా ఎదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటోంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంటే సరే. కానీ, ఇప్పుడు తమన్నా ఇంకా పెళ్లి విషయం చెప్తే.. తప్పించుకు తిరిగితే ఎలా చెప్పండి.

తమన్నా వయసు ఉన్న వ్యక్తులు ఇప్పటికే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. సమంత పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలు చేస్తోంది. దీనిపై తమన్నా స్పందించింది. పెళ్ళెప్పుడు అంటే.. త్వరలోనే అని చెప్తున్నది తమన్నా.. అంటే తమన్నా ప్రేమలో పడిందా అంటే అది కాదని, ప్రేమ వివాహం కాదని, పెళ్లి కొడుకును సెలక్ట్ చేసే బాధ్యత తల్లిదండ్రులకు అప్పగించానని అంటోంది.