టీడీఎల్పీ భేటీకి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా…

టీడీఎల్పీ భేటీకి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా...

0

మూడు రాజధానులపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఈనెల 20న అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నారు… ఈ సమావేశాల్లో రాజధానిపై క్లారిటీ రానుంది… అయితే ఈ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి రాజధానిపై ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అన్నదానిపై టీడీఎల్పీ భేటీ అయింది…

ప్రతీఒక్కరు అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలంటు ఇప్పటికే విప్ జారీ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా టీడీఎల్పీ భేటీకి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు…. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అలాగే వాసుపల్లి గణేష్, బెందాలం అశోక్ లు ఈ సమావేశాని దూరంగా ఉన్నారు..

తాము వ్యక్తిగత కారణాలతో సమావేశాలకు హజరుకాలేపోతున్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది… మరో వైపు రేపు ఛలో అమరావతి పిలుపునిచ్చింది అమరావతి జేఏసీ…