టీడీపీ బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు

టీడీపీ బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు

0

తెలంగాణ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు తేలిపోయింది… టీఆర్ఎస్ పార్టీ విజయం దిశగా దుసుకువెళ్తోంది… ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉంది… ఇక తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీలు హుజూర్ నగర్ లో డిపాజిట్లను కోల్పోయాయి…

ఇప్పటివరకు పూర్తి అయిన 10 రౌండ్లతో ఈ రెండు పార్టీలు తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి… ఈ పది రౌండ్లలో కారు హై స్పీడుతో ముందుకు దూసుకువెళ్తోంది… ఇక ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రెండవస్థానంలో ఉంది…

టీఆర్ఎస్ కారు 84003 ఓట్లను కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 52021 ఓట్ల దగ్గర కొట్టుమిట్టాడుతోంది… ఇక బీజీపీకి 1206 ఓట్లు రాగా టీడీపీకి 1142 మాత్రమే వచ్చాయి. మూడవ స్థానంలో బీజేపీ నాలుగవ స్థానంలో టీడీపీ ఉంది…