ఏపీలో మూటా ముళ్ళు సర్దేసిన టీడీపీ

ఏపీలో మూటా ముళ్ళు సర్దేసిన టీడీపీ

0

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది… దీనికితోడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ గతంలో ఎన్నడులేని విధంగా అభివ్రుద్ది కార్యక్రమాలు చేస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారు.

ఇక అటు కేంద్రంలో ఉన్న బీజేపీకూడా ఆపరేషన్ ఏపీ అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకున్నారు. ఆలా పార్టీనుంచి ఒక్కొక్కు బయటకు వెళ్తుండటంతో కేడర్ లో ఆందోళన నెలకొంది…

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల నాటికల్లా ఏపీలో టీడీపీ ఉండదని అన్నారు. తమకు ప్రధాన పోటీ బీజేపీనే అని అన్నారు. ఈ సందర్బంగా పార్టీలోకి వచ్చిన టీడీపీ నేతలను ఆయన పార్టీలో చేర్చుకున్నారు