అధికారంలో ఉన్నప్పుడు అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా

అధికారంలో ఉన్నప్పుడు అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా

0

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… ఏపీలో టీడీపీ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఈయన వైసీపీ తీర్థం తీసుకోవడంపై టీడీపీ స్పందించింది… గతంలో జూపూడి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని తెలిపారు… వైసీపీ ఒక అవినీతి పార్టీ అని విమర్శలు చేశారని తెలిపారు.

ఇప్పుడు అలాంటి అవినీతి పార్టీలో చేరారని ఎమ్మెల్యే వీరాంజనేయులు ఆరోపించారు… జూపూరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలో చేరడం ఆయనవాయితి అని అన్నారు…