టీడీపీకి ఆస్ధానమీడియా గట్టి షాక్

టీడీపీకి ఆస్ధానమీడియా గట్టి షాక్

0

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇసుక దీక్ష చేసిన విషయం తెలిసిందే.. అయితే బాబు ఏ ప్లాన్ వేసినా బాగానే నడుస్తుంది కాని, ఇప్పుడు అది ఫెయిల్ అయింది. తాజాగా తెలుగుదేశం ఇసుక దీక్షని హైలెట్ చేసింది, కాని వారు అనుకున్న విధంగా మాత్రం అది జనాలలోకి వెళ్లలేదు. అంతా బాబు విమర్శలతో నడిచింది.. అలాగే ఇసుక దీక్షపై మీడియా పెద్ద ఫోకస్ చేయలేదు , లైవ్ ఇవ్వలేదు, కేవలం యూ ట్యూబ్ లైవ్ లకు మాత్రమే పరిమితం అయింది.

బాబు అధికారంలో ఉన్న సమయంలో చూపిన హైప్ ఇప్పుడు లేదు, ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చేసిన ఇసుక దీక్షని పూర్తిగా వారి ఆస్దాన మీడియా పక్కన పెట్టేసి, కేవలం దేవినేని అవినాష్ అలాగే వల్లభనేని వంశీపై ఫోకస్ చేసింది, వారిద్దరి పై చర్చలకు వారి లైవ్ కు ప్రాధాన్య త ఇచ్చింది. మొత్తానికి అధికారం దూరం అవడంతో టీఆర్పీ కోసం ఆస్దాన మీడియా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అంటున్నారు నెటిజన్లు.