టీడీపీకి మరో మాజీ ఎంపీ గుడ్ బై

టీడీపీకి మరో మాజీ ఎంపీ గుడ్ బై

0

తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.. సీనియర్లు చాలా మంది టీడీపీలో ఉండాలా లేదా అనే ఆలోచనలో ఉన్నారు.. అయితే ఇప్పటికే గన్నవరం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు టీడీపీకి… అయితే తాజాగా మరో కీలక నేత కూడా టీడీపీలో యాక్టీవ్ గా లేరు అని వార్తలు వస్తున్నాయి.

ఆయనే ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అలియాస్ మాగంటి వెంకటేశ్వరరావు.. అయితే ఆయన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. ఏలూరులో ఆయన హవా నడిచింది. కాని ఈసారి మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు .. దీంతో ఆయన పార్టీ ఓటమి వచ్చిన రోజు నుంచి పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. ఆయన కుటుంబం అంతా జిల్లాలో పెద్ద పేరు ఉన్న కుటుంబం. కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో ఆయన మంత్రిగా చేశారు.

అయితే పార్టీ ఓటమితో ఆయన టీడీపీకి దూరం అయ్యారు. దీంతో బీజేపీ నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్లారు అని తెలుస్తోంది.. ఆయనని బీజేపీలోకి ఆహ్వనిస్తున్నారట. అందుకే ఆయన కాస్త తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.