చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే

చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే

0

2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్న తెలుగుదేశం పార్టీ స్థానికసంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోంది… అందుకు తగిన ప్లాన్లు కూడా టీడీపీ అధిష్టానం వేస్తోంది… అయితే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

ఇప్పటికే గుడివాడ టీడీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే… ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా వైసీపీలో చేరడం లాంఛమేనని అంటున్నారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోకముందు మరో షాక్ తగిలే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి…

ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు వైసీపీలో చేరాలని చూస్తున్నారట… టీడీపీలో కొనసాగితే తనకు రాజకీయ మనుగడ ఉండదని గ్రహించిన గొట్టిపాటి రవికుమార్ తర్వలో వైసీపీలోచేరాలని చేస్తున్నారట… ఆయన వైసీపీలో చేరితే జిల్లాలో టీడీపీ బలం మూడుకు చేరుతుంది…..