టీడీపీకి విజయసాయిరెడ్డి సలహాలు సూచనలు…

టీడీపీకి విజయసాయిరెడ్డి సలహాలు సూచనలు...

0

వరదలొస్తాయని సమాచారం ఉన్నప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు… సకాలంలో స్పందించక పోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలని అన్నారు… అయితే కరోనా విషయంలో కూడా యనమల, కళా లాంటి కాలం చెల్లిన మేధావులు వరద ముంపు తరహా విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు..

అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన వీళ్లు మంత్రులుగా చంద్రబాబు నాయుడు హయాంలో మేధావులమని బిల్డప్ ఇచ్చేవారని ఆరోపించారు… ప్రస్తుతం వీరు కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు…. టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటి? వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటి? కరోనా గురించి ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా అని విసాయిరెడ్డి సలహాలు ఇచ్చారు..

అంతా బాగున్నప్పుడే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టినోడు, ఫీజు రీఇంబర్స్ మెంటు ఇవ్వనోడు, ఇప్పుడేదో చేస్తానని చిటికెలేస్తున్నాడు. కరోనా సాకు చూపి కనీసం 10 వేల కోట్లు లేపేవాడు. ఎవరి మేత వాళ్లకు పడేస్తే ఎల్లో మీడియా, కన్నాలు, సున్నాలు అంతా అహా ఒహో అనేవారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు…