నిరసన.. అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

నిరసన.. అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

0

ఏపీ అసెంబ్లీలో ఈరోజు కీలక పరిణామాలు సంభవించాయి. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడంతో సభ వేడెక్కింది. ఆ తర్వాత కూడా సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ టీడీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద సభను నిర్వహిస్తున్న తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.