బీజేపీలోకి మరో టీడీపీ నేత నిజమేనా

బీజేపీలోకి మరో టీడీపీ నేత నిజమేనా

0

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది… ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నందికొట్కూరు ఫైర్ బ్రాండ్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి బీజేపీలో చేరాలని ప్రయత్రాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి…

ఇప్పటికే చాలామంది టీడీపీకి గుడ్ బై చెప్పారు… ఇప్పుడు బైరెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెబితే కార్నూల్ జిల్లాలో టీడీపీ సగం ఖాలీ అయినట్లే అని అంటున్నారు… బైరెడ్డికి టీడీపీకి చాలా అనుభందం ఉంది… గతంలో టీడీపీ తరపున ఆయన రాజకీయ ఓనామాలు దిద్దారు…

టీడీపీ తరపున ఎమ్మెల్యేగా 1994, 1999 నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు… ఇక ఆ తర్వాత నుంచి టీడీపీ తరపున పోటీ చేసినా కూడా ఆయన గెలవలేక పోయారు…