బాబుకు షాక్…. టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్

బాబుకు షాక్.... టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ లమీద షాకులు తగులుతున్నాయి…. హోరా హోరీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న నేపథ్యంలో ఆపార్టీ నాయకులు మూటాముళ్ళు సర్దేస్తున్నారు…

రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో ఉన్న ఫలంగా తమ్ముళ్లు టీడీపీకి గుడ్ బాయ్ చెప్పేస్తున్నారు… అయితే ఇప్పటికే పలువురు సీనియర్, జూనియర్ నాయకులు టీడీపీకి గుడ్ బాయ్ చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే ఇదే క్రమంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని కూడా త్వరలో టీడీపీకి గుడ్ బాయ్ చెప్పేపనిలో పడ్డారని వార్తలు వస్తున్నాయి…

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో సాధినేని యామిని దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.