చంద్రబాబుకు చెందిన కీలక నేతలకు జగన్ బంపర్ ఆఫర్

చంద్రబాబుకు చెందిన కీలక నేతలకు జగన్ బంపర్ ఆఫర్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి… తన పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిలేని పాలన అందించాలని భావిస్తున్నారు. అందుకే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన వారికి ఇతర పోస్టులకు పంపించారు.

అలాగే కనుమరుగైన పోలీసులకు కీలక బాధ్యతలను అప్పగించారు జగన్. ఇదే క్రమంలో సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హయంలో కీలక నేతలుగా వ్యవహరించి ఆయనకు నోట్లో నాలుకలా వ్యవహరించిన ఇద్దరికి జగన్ కీలక పదవులను అప్పజెప్పి అందరి ఆశ్చార్యానికి గురి చేశారు.

గతంలో చంద్రబాబుకు రైట్ హ్యాడ్ గా వ్యవహరించిన అజయ్ జైన్ కు జగన్ గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలను అప్పగించారు. అలాగే శ్రీధర్ కు సీసీఎల్ఎ సంయుక్త కార్యదర్శిగా నియమించారు జగన్. కాగా వీరిద్దరికి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలలుగా ఎటువంటి పోస్టులు రాలేదు.