జగన్ ఎఫెక్ట్ …ఈ జిల్లాలో టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా….

జగన్ ఎఫెక్ట్ ...ఈ జిల్లాలో టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా....

0

కడప జిల్లా…. ఈ జిల్లా ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వ్యక్తులను ముఖ్యమంత్రిని చేసింది… అంతటి ఘన చిరిత్ర ఉన్నఈ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇకనుంచి ఆశలు వదులు కోవాల్సిందేనని అంటున్నారు… వైఎస్ నాటి నుంచి నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరకు ఈ కుటుంబానికే అనుకూలంగా ఉన్నారు ఇక్కడి ప్రజలు..

2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలీ వీసినా కపడలో మాత్రం వైసీపీ గాలి వీసింది… ఇక అధికారంలోకి వచ్చిన టీడీపీ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశామని చెప్పినా కూడా 2019లో మరోసారి వైసీపీకే పట్టం కట్టారు… జగన్ అధికారంలోకి రావడంతో టీడీపీ తరపున బలంగా ఉన్న నేతలందరూ ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు సిద్దమయ్యారు…

మరికొందరు టీడీపీకి దూరంగా ఉన్నారు… ఆర్ధికంగా బలంగా ఉన్న రమేష్ కూడా బీజీపీలో చేరగా రేపోమాపో ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారు… రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరాలని చూస్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి సైలెంట్ గా ఉన్నారు.. దీంతో టీడీపీలో కడపలో ఉందా లేదా అన్నట్లు తయారు అయింది…