టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు జగన్ కీలక బాధ్యలు…

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు జగన్ కీలక బాధ్యలు...

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు కీలక బాధ్యతలను అప్పజెప్పారు… ఆయనకు పార్టీ తరపున అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పజెప్పారు…

ఆయనకు బాధ్యతలను అప్పజెప్పుతూ పార్టీ తరపున ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.. ఈవిషయాన్ని జిల్లా ఇంచార్జ్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోట త్రిమూర్తులుకు ఫోన్ చేసి సమాచారం చెప్పారు…

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనను నమ్మి తనకు అమలాపురం పార్లమెంట్ బాధ్యతలను అప్పజెప్పిందుకు కృతజ్ఞతలని తెలిపారు…

పార్టీ మెరుగు పరిచేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు… అంతేకాదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు… కాగా ఇటీవలే త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…