జగన్ ఇంటి ముందు ఆత్మ హత్య చేసుకునేందుకు సిద్దమైన టీడీపీ ఎమ్మెల్సీ

జగన్ ఇంటి ముందు ఆత్మ హత్య చేసుకునేందుకు సిద్దమైన టీడీపీ ఎమ్మెల్సీ

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిఇందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, విజయవాడ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆరోపించారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ…. వైసీపీ నాయకులు తమనేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హతమార్చెందుకు సిద్ధపడ్డారని అయన ఆరోపించారు.

ఒక పద్ధతి ప్రకారం హతమార్చేందు వైసీపీ నాయకులు కుతంత్రాలకు పాల్పడుతున్నారని బుద్దవెంకన్న అన్నారు… అయితే వైసీపీ నాయకులు ఇప్పటికైనా అక్రమాలు చేయడం మానుకోవాలని లేకపోతే ఈ కుట్రలు ప్రపంచానికి తెలిసేలా తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బుద్ధా వెంకన్న హెచ్చరించారు..

తమ నేత కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు బుద్ధా వెంకన్న … గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతి ప్రతిపక్షంలో ఉన్నపుడు అయన కుటుంబానికి చంద్రబాబు రక్షణ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అయితే వైసీపీ నాయకుల లాగా గతంలో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసివుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉండేదికాదని అన్నారు.