చంద్రబాబుకు బిగ్ ఇస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

చంద్రబాబుకు బిగ్ ఇస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

0

2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత… ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి… పార్టీని నమ్ముకున్న వారు చాలా మంది నష్టపోయామని లోలోపల భాధపడుతున్నారు… అలా బాధపడుతున్న వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్…

ఆయన చాలాకాలంగా పార్టీని నమ్ముకుని వచ్చారు… జిల్లాలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తనదైన శైలిలో వ్యవహరించి తమ్ముళ్లను యాక్టివ్ చేశారు… ఇంతలా కృషి చేసిన ఆయనకు 2014లో మంత్రిపదవి దక్కుతుందని అందరు భావించారు. కానీ దక్కలేదు… ఈ ఎన్నికల్లో జగన్ సునామికి తట్టుకుని విజయం సాధించారు… దీంతో ఈ సారైనా తనకు ప్రతిపక్ష పదవి దక్కుతుందని ఆశించారు.. ఆ పదవి కూడా బుచ్చయ్య దక్కించుకున్నారు…

ఇక చివరికి పీఏసీ చైర్మెన్ పదవైనా దక్కుతుందని భావించారు అదికూడా పయ్యావులు కేశవ్ కు దక్కింది. విజయవాడలో కీలక ఎమ్మెల్యే అయిన తనకు ఏ పదవి దక్కక పోవడంతో మానసింగా హర్ట్ అయ్యారని అంటున్నారు అందుకే ఆయన కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గద్దె రామ్మోహన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.