వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్సీ క్లారిటీ

వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్సీ క్లారిటీ

0

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ రిత్య ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు… ఇప్పటి చాలా మందినేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షమంలో త్వరలో వైసీపీ తీర్ధం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉంటువస్తున్నారని అంటున్నారు.

ఇక తనపై వస్తున్నా వార్తలపై ఆయన స్పందించారు… తాను పార్టీ మారుతున్నారంటువస్తున్న వార్తలు చాలా దుర్మార్గమని అన్నారు… టీడీపీలో ఉంటూ ప్రజలకు మేలు చేసే నిర్ణయాల్లో భాగస్వామినవుతానని స్పష్టం చేశారు డొక్కా…