టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు… తాజాగా ఈ సంఘటన రొంపిచర్లలో జరిగింది… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టీడీపీ నేత కుమ్మెత కోటి రెడ్డి రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ ముందు డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు…

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను హూటా హుటీన నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు… కొద్దిరోజుల క్రితం ఓ దాడి కేసులో కుమ్మెత కోటి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు…

దీంతో మనస్తాపానికి చెందిన కోటి రెడ్డి అర్థరాత్రి పోలీస్ స్టేషన్ ముందు డెటాల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు… ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు… వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని అన్నారు…