టీడీపీ నుంచి మంత్రి అనిల్ కు ఆఫర్

టీడీపీ నుంచి మంత్రి అనిల్ కు ఆఫర్

0

ఏపీ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… రెడ్ల డామినేషన్ ఉన్న పార్టీలో బీసీ వర్గానికి చెందిన అనిల్ కూమార్ ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కోలేదా అని మీడియా ప్రశ్నించింది… దీనికి ఆయన జవాబు ఇస్తూ తాను ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని జగన్ మోహన్ రెడ్డి తనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పట్టికి తనకు ఇంత పెద్ద పదవిని ఇచ్చారని ఆయన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు…

తనపై జగన్ నమ్మకంతోనే ఈ పదవిని ఇచ్చారని అన్నారు… అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అవాకాశం రాలేదా అని అడిగితే తనకు అలాంటి ఆఫర్స్ రావని అన్నారు… బేసిక్ గా చంద్రబాబు నాయుడు అగ్రసివ్ నాయకులను తన దగ్గర ఉంచుకోవాలని చూస్తారు… ఎప్పుడైనా పార్టీలోకి రమ్మని అడగలేదా అన్న ప్రశ్నకు అనిల్ సమాధానం ఇస్తూ తనను పార్టీలోకి రావాలని ఎవ్వరు అడగలేదని అనిల్ స్పష్టం చేశారు..

ఇక నుంచి కూడా తనను టీడీపీలోకి వస్తావా అని అడగరని కూడా తనకు నమ్మకం ఉందని అన్నారు… చంద్రబాబు నాయుడు ఏ అవకాశం అయినా వాడేసుకుంటారని అన్నారు. అబపద్దాన్ని పది సార్లు మాట్లాడి దాన్ని నిజం చేసేలా ప్రచారం చేస్తారని అన్నారు…