టీడీపీ నుంచి మూడో ఎమ్మెల్యే కూడా జంప్

టీడీపీ నుంచి మూడో ఎమ్మెల్యే కూడా జంప్

0

2019 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ పార్టీనుంచి మూడో ఎమ్మెల్యే కూడా టీడీపీకి టాటా చెప్పాలని చూస్తున్నారట…

ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు… తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా అదె బాటపట్టారు… ఇక ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట…

అద్దంకి నియోజవర్గం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైకిల్ దిగనున్నారని మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు… 2019 టీడీపీ నుంచి పోటీ చేసిన గెలిచారు.. అయితే ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట..