టీడీపీ సామర్థ్యం చూసి చాప చుట్టేశారు…

టీడీపీ సామర్థ్యం చూసి చాప చుట్టేశారు...

0

కరోనా వైరస్ పై తనను సలహాలు అడగడంలేదనే ధోరణిలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారని అన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ… తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…ఆయన సామర్థ్యం చూశారు కాబట్టే ప్రజలు టీడీపీని చాప చుట్టి పక్కన పడేశారని అన్నారు..

కరోనా నివారణ కోసం కాకుండా ప్రజల భద్రతపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మోపిదేవి తెలిపారు… విపత్కర పరిస్థితలో నష్టపోయిన రైతును ఒక్కరినైనా చంద్రబాబు నాయుడు చూపిస్తారా అని ప్రశ్నించారు…

ప్రతీ పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు…చంద్రబాబులాగ తమ నేత హైటెక్ ప్రచారాలకు పోలేదని అన్నారు… కష్ట కాలంలో రాజకీయ విమర్శలు చేయడం తగదని అన్నారు మోపిదేవి…