టీడీపీ సీనియర్ నేత మృతి

టీడీపీ సీనియర్ నేత మృతి

0

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందారు… ఆయనకు గుండెపోటు రావడంతో హుటా హుటీనా హైదరాబాద్ కు తరలిస్తుండటంతో మార్గ మద్యంలో మృతిచెందారు పసుపులేటి బ్రహ్మయ్య ..

దాంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు… ఇక విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు… అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన సంతాపాన్ని తెలిపారు…

ఫిబ్రవరి నెలలో కూడా పసుపులేటి బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో అప్పుడు అయన విజయవాడలోని రమేష్ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకున్నారు.. కాగా ఎన్నికల నాటి నుంచి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు… పార్టీ తరపున అయన రాజంపేట టికెట్ ఆశించారు.. కానీ ఆ టికెట్ చెంగల్ రాయుడు కు ఇవ్వడంతో అయన కొద్దికాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు