తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..ముగ్గురు మృతి..కొత్త కేసులు ఎన్నంటే?

Telangana Corona Bulletin Release..Three killed..What are the new cases?

0
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 68,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,398 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,05,199కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,052కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 1,181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,676 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,233 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 96.35 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here